శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Apr 06, 2020 , 00:08:18

సిద్ధంగా 14 వేల హార్వెస్టర్లు

సిద్ధంగా 14 వేల హార్వెస్టర్లు

-వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వరి కోతలకు 14,848 హార్వెస్టింగ్‌ యంత్రాలు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయశాఖ కార్యదర్శి డాక్టర్‌ బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. పలు హార్వెస్టింగ్‌ యంత్రాల తయారీ కంపెనీలతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి చర్చించారు. రైతుల అవసరాల మేరకు ఇతర రాష్ర్టాల నుంచి హార్వెస్టర్లు తెప్పించి కోతల సమయం కల్లా సిద్ధంగా ఉంచాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. ఆ మేరకు రాష్ట్రంలో 14,095 హార్వెస్టర్లు అందుబాటులో ఉండ గా మరో 753 యంత్రాలను తమిళనాడు నుంచి తెప్పించినట్టు వెల్లడించారు. 

పంటలు ఎలా ఉన్నాయి?

వ్యవసాయ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఆదివారం పలువురు రైతులతో నేరుగా ఫోన్లో మాట్లాడారు. నల్లగొండ జిల్లా రామడుగు రైతు సైదిరెడ్డి, తిప్పర్తి రైతు శ్రీనివాసాచారి, చిట్యాల రైతు సత్తిరెడ్డితో మాట్లాడిన ఆయన పంటలవివరాలు, సమస్యలను అడిగారు. ఇతర అధికారులతోనూ మాట్లాడారు. 

ఇంటికే కూరగాయలు

మార్కెట్లకు వచ్చే రైతులు, వినియోగదారుల కోసం సప్తగిరి ల్యాబొరేటరీస్‌ ఎండీ శిల్పారెడ్డి, చైర్మన్‌ మహేశ్‌రెడ్డి రూ.2.5 లక్షల విలువైన 1000 శానిటైజర్‌ బాటిళ్లను ఆదివారం సచివాలయంలో జనార్దన్‌రెడ్డి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయికి అందజేశారు. రోజూ 300 మొబైల్‌ రైతుబజార్ల ద్వారా వినియోగదారుల వద్దకే కూరగాయ లు పంపిస్తున్నామని  జనార్దన్‌రెడ్డి తెలిపారు.