మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 19:31:52

మ‌ను ఐటీఐ ప్ర‌వేశ ద‌ర‌ఖాస్తుల‌కు సెప్టెంబ‌ర్ 14 గ‌డువు

మ‌ను ఐటీఐ ప్ర‌వేశ ద‌ర‌ఖాస్తుల‌కు సెప్టెంబ‌ర్ 14 గ‌డువు

హైద‌రాబాద్ : మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం(మ‌ను) ఐటిఐ ట్రేడ్స్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14. పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటిఐ), హైదరాబాద్, మ‌ను.. ఐటిఐ ట్రేడ్స్ లో డ్రాఫ్ట్స్‌మన్ - సివిల్, రిఫ్రిజరేషన్ & ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ప్లంబర్ కోర్సుల్లో ప్రవేశాలను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ http://manuu.edu.in/ ద్వారా తమ వివ‌రాల‌ను నమోదు చేసుకోవాలి. ట్రేడ్‌ల ప్రాధాన్యత క్రమంలో ఆన్‌లైన్ ద్వారా మాత్ర‌మే తమ దరఖాస్తులను సమర్పించాలని మ‌ను అధికారులు తెలిపారు. 

అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు కనీసం పదవ తరగతి స్థాయిలో ఉర్దూను ఒక స‌బ్జెక్ట్‌గా కలిగి ఉండాలి. అత్యధిక అర్హత ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణత అయితే, దరఖాస్తుదారుడు ఉర్దూను ఎనిమిదో తరగతిలో ఒక స‌బ్జెక్ట్‌గా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అన్ని ట్రేడ్స్‌లు ఉర్దూ మాధ్యమంలో అందించబడుతాయ‌ని పేర్కొన్నారు. 


logo