శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 16:23:56

విదేశాల నుంచి వచ్చినవారుహోం క్వారంటైన్‌లో ఉండాలి

విదేశాల నుంచి వచ్చినవారుహోం క్వారంటైన్‌లో ఉండాలి

నిజామాబాద్: విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజుల పాటు హొమ్ క్వారంటైన్‌లో కచ్చితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి  అన్నారు.  నిజామాబాద్ జిల్లా కు 2203 మంది ఇతర దేశాల నుంచి వచ్చారని వారిని ప్రత్యేక గదిలో ఉండవలసిందిగా తెలియ చేసినప్పటికీ కొందరు బయటకు వస్తున్నారని వారి గురించి  ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా లెవెల్ వేరేగా క్వారంటైన్‌ ఏర్పాటు చేయడానికి సోమవారం జిల్లా కలెక్టర్ ఎం సి హెచ్ సెంటర్ కొరకు మాక్లూర్ నర్సింగ్ కాలేజ్ ను పరిశీలించారు.  ఎంసీహెఛ్ లో 52 గదులు, నర్సింగ్ కళాశాలలో 72 గదులు కలెక్టర్ పరిశీలించారు.

రేపు సాయంత్రం వరకు శానిటేషన్, మంచినీరు, విద్యుత్తు ఉండేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టాంపు వేసిన విదేశాల నుంచి వచ్చిన వారు  బయట తిరుగుతున్న వారి కోసం  14 రోజులు బయటికి రాకుండా ఉంచేందుకు వీటిని ఉపయోగించనున్నట్లు  తెలిపారు.  ఎవరైనా బయటదేశాల నుంచి వచ్చిన వారు ఇంటి బయట కనిపిస్తే పోలీసులకు, 104 నెంబర్ కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.  కలెక్టర్ వెంబడి డి ఎమ్ హెచ్ ఓ సుదర్శనం, హాస్పిటల్ సూపర్డెంట్ నాగేశ్వరరావు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇందిర, డాక్టర్లు తదితరులు ఉన్నారు


logo