శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 09:41:25

రాష్ట్రంలో కొత్తగా 1,302 కరోనా కేసులు..

రాష్ట్రంలో కొత్తగా 1,302 కరోనా కేసులు..

హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్తగా 1,302 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,72,608కి చేరింది. కొత్తగా 2230 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 1,41,930 మంది ఇండ్లకు చేరుకున్నారు. తాజాగా మరో 9 మంది మృతి చెందగా, మొత్తం 1,042 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,636 యాక్టివ్‌ కేసులున్నాయని, మరో 22,990 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ చెప్పింది. కాగా, రాష్ట్రంలో 0.60శాతం మరణాలు రేటు ఉండగా, రికవరీ రేటు 82.22శాతంగా ఉందని పేర్కొంది. నిన్న ఒకే రోజు 31,095 శాంపిల్స్‌ పరీక్షించగా, 1205 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, ఇప్పటికీ మొత్తం 25,19,315 టెస్టులు చేసినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో 266 నిర్ధారణ అయ్యాయి. తర్వాత కరీంనగర్‌లో 102, రంగారెడ్డి 98, సిద్దిపేటలో 92 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo