బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 08:23:22

ఆటోను ఢీకొన్న లారీ: 13 మందికి గాయాలు

ఆటోను ఢీకొన్న లారీ: 13 మందికి గాయాలు

సూర్యపేట: జిల్లాలోని మట్టంపల్లి మండలం సుల్తానుపురం తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆటో ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పది సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. బాధితులు పాత ధనబండ తండా వాసులుగా గుర్తించారు. మట్టంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిద్ర చేయడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


logo