శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 01:19:22

రోజుకు 13లక్షల లీటర్ల పాలసేకరణ

రోజుకు 13లక్షల లీటర్ల పాలసేకరణ
  • రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ Dairy Development Corporation Chairman Loka Bhuma Reddy

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి: రాష్ట్రం లో విజయ డెయిరీ ఆధ్వర్యంలో రోజుకు 13 లక్షల లీటర్ల పాలను సేకరించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్‌ లోక భూమారెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌లోని విజయ డెయిరీ కార్యాలయంలో  ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.30 కోట్ల నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ సహకారంతో లాభాల్లోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. పాత బకాయిలు రూ.25 కోట్లు చెల్లించడంతోపా టు రూ.15 కోట్లను బ్యాంకుల్లో ఫిక్స్‌ డిపాజిట్‌ చేశామన్నారు. 


కామారెడ్డి సమీపంలో 25 ఎకరాల్లో మెగా డెయిరీ ఏర్పాటుకు చర్య లు తీసుకుంటున్నామని, హైదరాబాద్‌లో అదనంగా మరో డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విజయ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తున్నదని, వినియోగదారులకు నాణ్యమైనపాలు, పాల ఉత్పత్తులను తక్కువ ధరలో అందిస్తున్నామన్నారు. పాల ఉత్పత్తిదారుల సొసైటీల్లో 2.13 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని చెప్పారు. సొసైటీలను పెంచడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పాడి రైతుకు లీటర్‌కు రూ.4 చొప్పున పోత్సాహం అందిస్తున్నామని, దీంతో పాలు సరఫరా చేసే రైతుల సంఖ్య క్రమంగాపెరుగుతున్నట్టు లోక భూమారెడ్డి తెలిపారు.


logo