గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 25, 2020 , 02:31:11

90.77 శాతానికి చేరిన రికవరీ రేటు

90.77 శాతానికి చేరిన రికవరీ రేటు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా సోకి కోలుకున్నవారి శాతం రికార్డుస్థాయికి చేరుకున్నది. తెలంగాణలో రికవరీ రేటు 90.77శాతానికి చేరుకోగా, దేశంలో 89.07 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు 40.52 లక్షల టెస్టులు పూర్తిచేయగా, 2.30 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో 2.09 లక్షల మంది కోలుకోగా, 19,937 మంది ఇండ్లు, దవాఖానల్లో కోలుకుంటున్నట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. శుక్రవారం 1,273 కేసులు వెలుగుచూశాయి. జీహెచ్‌ఎంసీలో 227, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 104, రంగారెడ్డిలో 102 కేసులు నమోదయ్యాయి

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
శుక్రవారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
1,273
2,30,274
డిశ్చార్జి అయినవారు
1,708
2,09,034
మరణాలు
05
1,303
చికిత్స పొందుతున్నవారు
-
19,937