మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 16:17:27

12 ఏళ్ల బాలుడి గొప్ప మనసు..జూలో పులిని దత్తత తీసుకున్నాడు..!

12 ఏళ్ల బాలుడి గొప్ప మనసు..జూలో పులిని దత్తత తీసుకున్నాడు..!

హైద­రా­బాద్‌: అందరూ పుట్టినరోజున ఏం చేస్తారు..? కేక్‌ కట్‌చేసి, ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చి సంబురాల్లో మునిగిపోతారు. కానీ ఓ 12 ఏళ్ల బాలుడు తన గొప్ప మనసు చాటుకున్నాడు. జంతు ప్రదర్శనశాలలోని రాయల్‌బెంగాల్‌ టైగర్‌ను దత్తత తీసుకున్నాడు. అంటే దాని పోషణకయ్యే ఖర్చును అందజేశాడు.  

హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌ షా ఏడో తరగతి చదువుతున్నాడు. తన పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక నెహ్రూ జువాలాజికల్‌ పార్కులో ‘సంకల్ప్‌’ అనే రాయల్ బెంగాల్ టైగ­ర్‌ను దత్తత తీసు­కు­న్నాడు. అతని తండ్రి సిద్ధార్థ్ కాంటి­లాల్ షాతో కలిసి వచ్చిన సిద్ధార్థ్‌ క్యూరే­టర్ కార్యా­ల­యాన్ని సంద­ర్శించి, రూ .25 వేల చెక్కును జూ అధికారికి ఇచ్చారు. షాతోపాటు మరో ఇద్దరు విద్యార్థులు హర్విషా జైన్, విహాన్ అతుల్ జైన్, మరో ముగ్గురు అక్కాచెల్లెల్లు ప్రేక్ష, ప్రియాల్, భక్తి నాగ్డా కూడా జంతువులు, పక్షులను దత్తత తీసుకున్నట్లు జూ అధికారులు వెల్లడించారు. వీరు ఒక్కొక్కరూ రూ.5,000  చెక్కును అంద­జేసినట్లు చెప్పారు. వన్య­ప్రా­ణుల పరి­ర­క్షణ పట్ల విద్యార్థు­లకు ఉన్న ప్రేమ, ఆప్యా­య­త­లకు నెహ్రూ జూలా­జి­కల్ పార్క్ డిప్యూటీ క్యూరే­టర్ కృత­జ్ఞ­తలు తెలి­పారు. మరికొంత మంది ముందుకొచ్చి జంతువులను దత్తత తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo