బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 21:48:34

కరోనా నేపథ్యంలో 12 రైళ్లు రద్దు

కరోనా  నేపథ్యంలో 12 రైళ్లు రద్దు

హైదరాబాద్ :  కోవిడ్‌-19 నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే 12 రైళ్ళు రద్దు చేసింది.సికింద్రాబాద్‌ నుండి రాకపోకలు సాగించే 4 రైళ్లు, హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగించే 4 రైళ్లు,కరీంనగర్‌ నుండి రాకపోకలు సాగించే 4 రైళ్లు ఇందులో ఉన్నాయి. ఐతే కరోనా నేపథ్యంలో రిజర్వేషన్‌ సంఖ్య 30 శాతానికి తగ్గిపోవడంతో వీటిని రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే  ప్రకటించింది. ఇందులో  ముంబాయి ఎల్‌టీటీ నుండి కరీంనగర్‌కు మార్చి 21,28వ తేదీలలో వచ్చే రైళ్ళతోపాటు, కరీంనగర్‌ నుండి ముంబాయి ఎల్‌టీటీకీ 22,29 తేదీలలో బయలుదేరే రైళ్లు, హైదరాబాద్‌ నుండి కలబుర్గీ స్టేషన్‌ మధ్య ఈ నెల18,31 తేదీలలో బయలుదేరే రైళ్ళతోపాటు , కలబుర్గి నుండి హైదరాబాద్‌కు 18,31 తేదీలలో వచ్చే రెండు రైళ్ళు, సికింద్రాబాద్‌ నుండి చెన్నైకి 21,23 తేదీలలో బయలుదేరే రెండు రైళ్ళతోపాటు చెన్నై నుండి సికింద్రాబాద్‌కు 20,22 తేదీలలో వచ్చే రెండు రైళ్ళు ఉన్నాయి. మిగతా రైళ్ళ విషయానికి వస్తే ముంబాయి ఎల్‌టీటీ-అజ్ని మధ్య నడిచే నాలుగురైళ్లు, సంత్రాగచి-చెన్నై మధ్య నడిచే నాలుగు రైళ్లను కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు.logo