శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 01:37:59

మాదిగలకు 12% రిజర్వేషన్‌ కల్పించాలి

మాదిగలకు 12% రిజర్వేషన్‌ కల్పించాలి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాదిగ కులం వారికి 12శాతం రిజర్వేషన్‌ కల్పించాలని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఏబీసీడీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని మాదిగ సంఘాల నాయకులు డిమాండ్‌చేశారు. 26 ఏండ్లుగా మాదిగలకు న్యాయం జరుగడం లేదని, ఉద్యమ నాయకుడు మాత్రం బాగుపడ్డారని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి, టీఎంఎస్‌ఎస్‌ అధ్యక్షుడు గడ్డి యాదయ్య, వివిధ సంఘాల నాయకులు గజ్జెల కాంతం, ఇటుక రాజు, బీఎస్పీ నాయకుడు గద్దల అంజిబాబు తదితరులు గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. logo