గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 22:55:49

‘పేట’లో 12 కిలోల గంజాయి పట్టివేత

‘పేట’లో 12 కిలోల గంజాయి పట్టివేత

సూర్యాపేట : అక్రమంగా కారులో తరలిస్తున్న 12 కిలోల గంజాయిని సూర్యాపేట పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం లాల్‌సింగ్‌తండాకు చెందిన భూక్య రాము కారులో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామ స్టేజీ వద్ద రూరల్‌, సీసీఎస్‌ పోలీసులు నిఘాపెట్టారు.

పెన్‌పహాడ్‌ వైపు నుంచి వస్తున్న కారును నిలిపి తనిఖీ చేసి గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లోని దారుకొండ నుంచి గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 200 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. గంజాయిని పట్టుకున్న సీసీఎస్‌ సీఐ నిరంజన్‌, ఎస్‌ఐ శ్రీనివాస్‌ను అభినందించారు. సమావేశంలో సీఐ విఠల్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.