బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Jul 06, 2020 , 10:56:52

హైదరాబాద్‌లోని బోరబండలో 12 కేజీల గంజాయి పట్టివేత

హైదరాబాద్‌లోని బోరబండలో 12 కేజీల గంజాయి పట్టివేత

హైదరాబాద్ : హైదరాబాద్‌ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బోరబండలోని ఓ ఇంటిపై బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి 12 కేజీల గంజాయిని స్వాధినం చేసుకున్నారు. వైకుంఠరావు అనే యువకుడు గత కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు అతని ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో గంజాయితో పాటు షిఫ్ట్ డిజైర్ కారు, సెల్‌ఫోను, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు వైకుంఠరావు తెలిపారుడు. నిందితుడ్ని పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైకుంఠరావును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo