బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 04, 2020 , 20:00:22

భ‌ద్రాద్రిలో క‌రోనా క‌ల‌క‌లం.. 12 మంది ఐఆర్ కానిస్టేబుళ్ల‌కు పాజిటివ్

భ‌ద్రాద్రిలో క‌రోనా క‌ల‌క‌లం.. 12 మంది ఐఆర్ కానిస్టేబుళ్ల‌కు పాజిటివ్

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : జిల్లాలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. చాట‌కొండ‌లోని టీఎస్ఎస్పీ ఆరో బెటాలియ‌న్ కు చెందిన 12 మంది ఐఆర్ కానిస్టేబుళ్ల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు జిల్లా వైద్యాధికారి శ‌నివారం వెల్ల‌డించారు. వీరంతా ఇటీవ‌లే.. హైద‌రాబాద్ లోని అంబ‌ర్ పేట‌, జుమ్మెరాత్ బ‌జార్ లో ఏర్పాటు చేసిన బందోబ‌స్తుకు హాజ‌ర‌య్యారు. 

స్థానిక త‌హ‌సీల్దార్ భ‌ద్ర‌కాళి, ఎంపీడీవో రామారావు, ఆరోగ్య సిబ్బంది ఆరో బెటాలియ‌న్ క్యాంపును సంద‌ర్శించి.. ప‌లు సూచ‌న‌లు చేశారు.  బెటాలియ‌న్ తో పాటు ఆ ప‌రిస‌ర ప్రాంతాల‌ను సోడియం హైపోక్లోరైడ్ ద్రావ‌ణంతో శానిటైజ్ చేయాల‌ని సూచించారు. మొత్తానికి భ‌ద్రాద్రిలో పాజిటివ్ కేసుల సంఖ్య 54కు చేరింది.    logo