గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 10:20:52

దుబ్బాకలో 9 గంటల వరకు 12.74శాతం పోలింగ్‌

దుబ్బాకలో 9 గంటల వరకు 12.74శాతం పోలింగ్‌

హైదరాబాద్‌ : దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు నియోజకవర్గవ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ను సిబ్బంది ప్రారంభించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9గంటల వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 12.74 పోలింగ్‌ శాతం నమోదైందని ఎన్నికల అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. లచ్చపేటలోని స్ట్రాంగ్‌ రూమ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతీ హొళికెరి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్‌ శాతం నివేదికను పంపాలని ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా 104 పోలింగ్‌ కేంద్రాలను పోలింగ్‌ తీరును పరిశీలించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.