శనివారం 11 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 01:27:06

చెట్లు నరికితే చర్యలు

చెట్లు నరికితే చర్యలు

  • పీఆర్డీశాఖ 12.67 కోట్ల మొక్కలు నాటాలి 
  • ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యవేక్షించాలి
  • వీడియో కాన్ఫరెన్స్ మంత్రి దయాకర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/కందుకూరు: చెట్లు నరికే, తొలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హెచ్చరించారు. ఈ నెల 25 నుంచి మొదలయ్యే ఆరోవిడుత హరితహారంలో ఉద్యమంలా మొక్కలు నాటాలని సూచించారు. హరితహారంపై అడిషనల్ కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, , ఎంపీడీవోలు, ఎంపీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండలస్థాయి అధికారులతో సోమవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది 30 కోట్ల మొక్కల లక్ష్యంలో 12.67 కోట్ల మొక్కలు నాటే బాధ్యత గ్రామీణాభివృద్ధిశాఖపైనే ఉన్నదని చెప్పారు.  కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ హరితహారం ప్రియాంకవర్గీస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ పాల్గొన్నారు.

రూ.658.31 కోట్ల పనులకు కేంద్రం ఆమోదం

పీఎంజీఎస్ కింద 11,19,94 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి రూ.658.31 కోట్ల విలువైన పనులను ఆమోదించిన కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.


logo