e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home తెలంగాణ విప్‌ సుమన్‌కు సీఎం ఓదార్పు

విప్‌ సుమన్‌కు సీఎం ఓదార్పు

విప్‌ సుమన్‌కు సీఎం ఓదార్పు
  • దివంగత బాల్క సురేశ్‌ చిత్రపటానికి నివాళి
  • కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన సీఎం కేసీఆర్‌

జగిత్యాల, జూన్‌ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారుడు, మెట్‌పల్లి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ దివంగత బాల్క సురేశ్‌ కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం పరామర్శించారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ తండ్రి బాల్క సురేశ్‌ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. తండ్రిని కోల్పోయి దుఖంలో ఉన్న సుమన్‌ను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్‌ బుధవారం హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పరిధిలోని రేగుంటకు వెళ్లారు. అక్కడికి చేరుకున్న సీఎంకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కలెక్టర్‌ గుగులోత్‌ రవి ఆహ్వానం పలికారు. మధ్యాహ్నం 3.35 గంటలకు సుమన్‌ ఇంటికి చేరుకున్న ముఖ్యమంత్రి, దివంగత బాల్క సురేశ్‌ చిత్రపటంపై పూలుచల్లి నివాళులర్పించారు. అనంతరం బాల్క సుమన్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆత్మైస్థెర్యంతో ఉండాలని సుమన్‌ను ఓదార్చారు. సుమన్‌ తల్లి ముత్తమ్మ, సోదరుడు, సోదరిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. సుమన్‌ కుటుంబసభ్యులతో దాదా పు 15 నిమిషాలపాటు గడిపారు. తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరే ముందు కలెక్టర్‌ గుగులోత్‌ రవితో మాట్లాడారు. జిల్లాలో కరోనా పరిస్థితులు, వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, వైద్యసేవలు, వసతులపై ఆరా తీశారు. లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయడంతో కరోనా కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టాయని కలెక్టర్‌ వివరించారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 4.05 గంటలకు సుమన్‌ ఇంటినుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. కార్యక్రమంలో ఎంపీ లు వెంకటేషన్‌ నేతకాని, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, జగిత్యాల, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్లు దావ వసంత, నల్లాల భాగ్యలక్ష్మి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌, సుంకె రవిశంకర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య, రాష్ట్ర ఫైన్సాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జీ రాజేశంగౌడ్‌ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఐజీ వై నాగిరెడ్డి, కరీంనగర్‌ సీపీ వీ కమలాసన్‌రెడ్డి, ఎస్పీ సింధూశర్మ, ఇంటెలిజెన్స్‌ ఎస్పీ రాజమహేంద్రనాయక్‌ పర్యవేక్షించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విప్‌ సుమన్‌కు సీఎం ఓదార్పు

ట్రెండింగ్‌

Advertisement