సోమవారం 25 మే 2020
Telangana - Apr 04, 2020 , 11:06:56

మ‌ధుమేహంతో చిన్నారి మృతి.. చివ‌రి చూపుల‌కు నోచుకోని తండ్రి

మ‌ధుమేహంతో చిన్నారి మృతి.. చివ‌రి చూపుల‌కు నోచుకోని తండ్రి

 జ‌గిత్యాల‌: ప‌సి వ‌య‌సులోనే ఆ చిట్టిత‌ల్లి మ‌ధుమేహం బారినప‌డింది. త‌ల్లిదండ్రులు ఎన్ని ద‌వాఖాన‌ల చుట్టు తిప్పినా వ్యాధి ముదిరిందే త‌ప్ప త‌గ్గ‌లేదు. చివ‌రికి ప‌రిస్థితి విష‌మించ‌డంతో తండ్రి కోసం క‌ల‌వ‌రించి క‌ల‌వ‌రించి ఆ చిన్నారి క‌న్నుమూసింది. బ‌తుకుదెరువు కోసం ప‌రాయి దేశం పోయిన తండ్రికి క‌డుపుకోత‌ను మిగిల్చింది. ఈ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న జిగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండ‌లం తుంగూరు గ్రామంలో చోటుచేసుకుంది.   

తుంగూరు గ్రామానికి చెందిన భాస్క‌ర్‌, సునీత దంప‌తుల‌కు సాహిత్య అనే 11 ఏండ్ల కూతురు ఉంది. అయితే పుట్టుక‌తోనే మ‌ధుమేహం ఉండ‌టంతో త‌ల్లిదండ్రులు ఆ చిన్నారిని ఎన్నోఆస్ప‌త్రుల చుట్టు తిప్పారు. అయినా వ్యాధి ముదిరిపోయింది. దాంతోపాటు ఆ కుటుంబానికి అప్పులూ పెరిగిపోయాయి. దీంతో ఆ చిన్నారి తండ్రి భాస్క‌ర్ బ‌తుకుదెరువు కోసం ఐదు నెల‌ల క్రితం దుబాయికి వెళ్లాడు. కానీ ప‌రిస్థితి విష‌మించ‌డంతో శుక్ర‌వారం రాత్రి కూతురు చ‌నిపోయింది. విష‌యం తెలిసినా లాక్‌డౌన్ కార‌ణంగా ఆ తండ్రి రాలేక‌పోయాడు. క‌న్న‌బిడ్డ‌ను క‌డ‌సారైనా క‌ళ్లారా చూసుకోలేక‌పోయాడు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo