శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 16:26:47

సింగూరులోకి 11 టీఎంసీల నీరు .. గంగమ్మకు పూజలు చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

సింగూరులోకి 11 టీఎంసీల నీరు .. గంగమ్మకు పూజలు చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

సంగారెడ్డి : ఎగువన కురుస్తున్నవర్షాలతో సింగూరు ప్రాజెక్టు కు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం 66 వేల క్యూసెక్కుల వరద వస్తుంది. కాగా అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రాజెక్ట్ ను సందర్శించారు. మొన్నటి వరకు అర టీఎంసీ నీటితో ఎడారిని తలపించిన ప్రాజెక్ట్ లోకి వరద రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంగమ్మకు పూజలు చేశారు. ఇంకా వరద కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో నీటి మట్టం పెరగనున్నది.


logo