సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 02:27:14

కరోనా రికవరీ రేటు 79.2%

కరోనా రికవరీ రేటు 79.2%

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారినపడి కోలుకుంటున్నవారి శాతం క్రమంగా పెరుగుతున్నది. విస్తృతంగా పరీక్షలు, సకాలంలో చికిత్స అందిస్తుండటంతో రికవరీ రేటు 79.2 శాతానికి చేరుకున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.57 లక్షల మందికి కరోనా సోకగా, అందులో లక్షా 24 వేలమంది వరకు కోలుకున్నారు. మరో 31 వేల మంది ఇండ్లు, దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్కరోజే 2,216 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలినట్టు వైద్యారోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో వెల్లడించింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 341 కేసులు నమోదయ్యాయి.  కాగా కొవిడ్‌కుతోడు ఇతర దీర్ఘకాలిక రోగాల కారణంగా 11 మంది మరణించారు.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
శనివారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
2,216
1,57,096
డిశ్చార్జి
2,603
1,24,528
మరణాలు
11
961
చికిత్స పొందుతున్నవారు
-
31,607
logo