శనివారం 06 జూన్ 2020
Telangana - May 05, 2020 , 21:59:38

తెలంగాణలో కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణలో మంగళవారం కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం నేతృత్వంలో ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా ఏడు గంటల పాటు కొనసాగింది. అనంతరం సీఎం మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్‌-19 భారిన 1096 మంది పడ్డట్లు తెలిపారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 439. ఇప్పటి వరకు 628 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారన్నారు. నేడు 43 మంది డిశ్చార్జ్‌ అయినట్లు సీఎం తెలిపారు.


logo