శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 12:02:23

పేకాట ఆడుతున్న 11 మంది ప్రముఖులు అరెస్టు..

పేకాట ఆడుతున్న 11 మంది ప్రముఖులు అరెస్టు..

హైదరాబాద్ : గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న పలువురు ప్రముఖులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో పలువురు పేకాట ఆడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఇంటిపై దాడి చేసి వివిధ రంగాలకు చెందిన 11 మంది వ్యాపార ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు, ఏడుగురు వ్యక్తులున్నట్లు సమాచారం. వీరి నుంచి సెల్‌ఫోన్లతోపాటు రూ.3 లక్షల 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.