శనివారం 04 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:26:57

శ్రీశైల కుంభకోణంలో 11 మందిపై వేటు

శ్రీశైల కుంభకోణంలో 11 మందిపై వేటు

  • విచారణ ముగిసే వరకు శాశ్వత ఉద్యోగుల బదిలీలు 

శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో నిధుల కుంభకోణానికి సంబంధించి 11 మంది శాశ్వత ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. భక్తులు ఇచ్చిన విరాళాలతోపాటు ఆర్జిత సేవా దర్శన టికెట్ల సాఫ్ట్‌వేర్‌ను మార్చి సైబర్‌ నేరగాళ్లతో కలిసి కొందరు దేవస్థానం నిధులు పక్కదారి పట్టించిన విషయం తెలిసిందే. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించిన శాశ్వత ఉద్యోగులైన ఏఈవో ఎస్వీ కృష్ణారెడ్డి, బదిలీపై వెళ్లిన ఏఈవోలు సీహెచ్‌ శ్రీనివాసరెడ్డి, మోహన్‌, రిటైర్డ్‌ ఏఈవో రాజశేఖర్‌ను విచారణ ముగిసే వరకు సస్పెండ్‌ చేశారు. అలాగే ఆలయ సూపరింటెండెం ట్లు మధుసూదన్‌రెడ్డి, బీ మల్లికార్జున్‌రెడ్డి, కే వెంకటేశ్వర్‌రావుతోపాటు సీనియర్‌ అసిస్టెంట్లు శశిధర్‌రెడ్డి, ఎస్‌ శ్రీనివాస్‌రాజు, ఎం శ్రీనివాసరావు, రికార్డ్‌ అసిస్టెంట్‌ ఎం సావిత్రిలను బదిలీలపై ఇతర దేవస్థాలకు పంపిస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు. logo