గురువారం 02 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 02:12:58

15 నుంచి వెబ్‌సైట్‌లో ‘పది’ మెమోలు!

15 నుంచి వెబ్‌సైట్‌లో ‘పది’ మెమోలు!

త్వరలో స్కూళ్లకు ఒరిజినల్‌ మార్కుల జాబితా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులందరినీ పరీక్షలు రాయకుండానే పాస్‌ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అందరూ పాస్‌ కావడంతో 15వ తేదీ నుంచి షార్ట్‌ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచేందుకు ఎస్సెస్సీ బోర్డు కసరత్తు చేస్తున్నది. త్వరలోనే అన్ని స్కూళ్లకు ఒరిజినల్‌ మార్కుల జాబితాను కూడా పంపేందుకు సిద్ధమవుతున్నది. పరీక్షలు రాయకుండానే విద్యార్థులంతా పాస్‌ కావడంతో ఈ సారి రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ అంశాలు ఉత్పన్నం కావడం లేదు. కేవలం ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తున్నందున సమస్యలు ఉండబోవని అధికారులు అంటున్నారు. ఈసారి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల అవసరం కూడా లేకుండా పోయింది. logo