శనివారం 30 మే 2020
Telangana - May 11, 2020 , 00:50:36

కరోనాపై పోరులో మేము సైతం!

కరోనాపై పోరులో మేము సైతం!

  • బాధితులకు అండగా 108 సిబ్బంది 
  • 14,427 మందిని గాంధీకి చేర్చిన వాహనాలు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలను కాపాడుతున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది.. ప్రస్తుతం కరోనా నేపథ్యంలోనూ తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. కుటుంబసభ్యులు కొంతమంది వద్దని వారించినా.. ప్రజా ఆరోగ్యానికే జై కొడుతూ ఆరోగ్య రక్షకులుగా అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 90 వాహనాల ద్వారా 14,427 మంది అనుమానితులను దవాఖానలకు చేర్చారు. హైదరాబాద్‌లో 1,485 మందిని, రంగారెడ్డి 1,233, మేడ్చల్‌ 1,455, జోగుళాంబ గద్వాల 1,057, ఆదిలాబాద్‌ 868, భద్రాద్రి 288, జగిత్యాల 231, జనగామ 250, జయశంకర్‌ భూపాలపల్లి 61, కామారెడ్డి 134, కరీంనగర్‌ 401, ఖమ్మం 817, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ 194, మహబూబాబాద్‌ 146, మహబూబ్‌నగర్‌ 460, మంచిర్యాల 306, మెదక్‌ 49, ములుగు 11, నాగర్‌కర్నూల్‌ 135, నల్లగొండ 507, నారాయణపేట 99, నిర్మల్‌ 158, నిజామాబాద్‌ 1,385, పెద్దపల్లి 257, రాజన్న సిరిసిల్ల 99, సంగారెడ్డి 364, సిద్దిపేట 32, సూర్యాపేట 1194, వికారాబాద్‌ 48, వనపర్తి 13, వరంగల్‌ రూరల్‌ 49, వరంగల్‌ అర్బన్‌ 506, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 135 మందిని గాంధీ దవాఖానకు తరలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా కట్టడిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉన్నదని, అనుమానితుల తరలింపులో ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు రీజినల్‌ మేనేజర్‌ ఖలీద్‌ తెలిపారు.


logo