శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 12:15:15

108 వాహనంలో మహిళ ప్రసవం .. కవలల జననం

108 వాహనంలో మహిళ ప్రసవం .. కవలల జననం

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం నాగినేని ప్రోలు, రెడ్డిపాలెం రహదారి ఇసుక ర్యాంపు సమీపంలో 108 వాహనంలో ఓ మహిళ ప్రసవించింది. బూర్గంపహాడ్ గ్రామానికి చెందిన మేకల స్పందన అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్నది. పురిటి నొప్పులు తీవ్రమవడంతో 108 సిబ్బందికి ఫోన్ చేశారు. వారు హుటాహుటిన దవాఖానకి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే ఆమె ప్రసవించింది. పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లితో పాటు పిల్లలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు. తదుపరి వైద్య సేవల నిమిత్తం దవాఖానకు తరలించారు.
logo