గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 21:44:36

ముళ్లకంచెలో చిక్కుకున్న అంబులెన్స్‌!

ముళ్లకంచెలో చిక్కుకున్న అంబులెన్స్‌!

వీణవంక: కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని గంగారం గ్రామ సరిహద్దులో రహదారిపై ముళ్లకంచెలు, బండరాళ్లు వేయడంతో అత్యవసర పరిస్థితుల్లో అటుగా వెళ్తున్న అంబులెన్స్‌కు ఆటంకంగా మారింది. వివరాల్లోకెళితే గంగారం గ్రామానికి చెందిన ఓ గర్భిణిని డెలివరీ కోసం కరీంనగర్‌కు తీసుకెళ్లేందుకు 108 వాహనం బయల్దేరగా గ్రామ శివారులో ముళ్లకంచెలో చిక్కుకుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో చేసేదేమి లేక సిబ్బంది కిందికి దిగి ముళ్లకంచెలను పక్కకు తీసి, అంబులెన్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. కరీంనగర్‌కు చేరే సరికి చాలా ఆలస్యమైందని, గర్భిణి పురిటి నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడిందని 108 సిబ్బంది తెలిపారు. logo