మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 15:34:20

సైబరాబాద్‌ పరిధిలో 10,500 మంది సిబ్బందితో బందోబస్తు

సైబరాబాద్‌ పరిధిలో 10,500 మంది సిబ్బందితో బందోబస్తు

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 10,500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపట్టినట్లు సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో సైబరాబాద్‌ పరిధిలో చేపట్టిన భద్రతా చర్యలపై సీపీ వెల్లడించారు. సైబరాబాద్‌లో 19 పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 38 డివిజన్లు ఉన్నాయన్నారు. 684 చోట్ల 2,569 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు జరిగిందన్నారు. వీటిలో 770 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్లు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 3 వేల మంది అదనపు సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు. 179 రూట్‌ మొబైల్స్‌ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్ట్రాంగ్‌ రూంలు, లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల బందోబస్తును చేపట్టామన్నారు. 15 చోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 22 ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రౌడీషీటర్లను ముందస్తుగా బైండోవర్‌ చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు.