బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 17:43:53

కోవిడ్ రోగుల‌కు వ‌రంగ‌ల్ ఎంజీఎంలో మ‌రో 100 ప‌డ‌క‌లు

కోవిడ్ రోగుల‌కు వ‌రంగ‌ల్ ఎంజీఎంలో మ‌రో 100  ప‌డ‌క‌లు

వ‌రంగ‌ల్ అర్బ‌న్ : వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రిలో కోవిడ్‌-19 రోగుల చికిత్స నిమిత్తం మ‌రో 100 ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ కె. నాగార్జున రెడ్డి తెలిపారు. దీంతో ఆస్ప‌త్రిలో కోవిడ్ రోగుల‌ ప‌డ‌క‌ల సంఖ్య 440కు చేరింద‌న్నారు. కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ఎస్‌. సంధ్యా, రెసిడెంట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ ర‌మ‌ణతో క‌లిసి నాగార్జున రెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడారు. కోవిడ్‌-19 ల‌క్ష‌ణాల‌తో వ‌చ్చే ప్ర‌తీ వ్య‌క్తికి చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పారు. ఆస్ప‌త్రిలో ప్ర‌స్తుతం 134 మంది క‌రోనా రోగులు చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపారు. ఆస్ప‌త్రిలో 24 గంట‌లు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. 5,590 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 2212 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా తేలింద‌న్నారు. 15 రోజుల్లో ఆస్ప‌త్రిలో 13 కిలోలీట‌ర్స్ ఆక్సిజ‌న్ ట్యాంక్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.


logo