శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 13:40:52

నిరక్షరాస్యత నిర్మూలన కోసం రూ. 100 కోట్లు

నిరక్షరాస్యత నిర్మూలన కోసం రూ. 100 కోట్లు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగానే రాష్ర్టాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించే రాష్ట్రంగా మార్చడం కోసం సీఎం కేసీఆర్‌ ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌ అనే స్ఫూర్తిదాయక నినాదాన్ని అందించారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యతను నిర్మూలించడం కోసం ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన జరుగుతున్నదని తెలిపారు. ఇందు కోసం బడ్జెట్‌లో రూ. 100 కోట్లు ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ కోసం రూ. 2,650 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖకు రూ. 10,421 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ. 1,723.27 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.


logo