సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 21:26:57

పదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్

పదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్

నల్గొండ జిల్లా: నల్లగొండ జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలో ఓ బాలుడికి కరోనా సోకింది. వాడపల్లి గ్రామానికి చెందిన బాలుడికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సదరు బాలుడిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.  బాలుడు సన్నిహితంగా ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నట్లువైద్య సిబ్బంది ఒకరు తెలిపారు.

మరోవైపు డాక్టర్లు వాడపల్లి పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేసే పనిలో ఉన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ..సామాజిక దూరం నిబంధనలు పాటించాలని, ఫేస్ మాస్కులు ధరించాలని డాక్టర్లు సూచించారు. 
logo