శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 02, 2020 , 20:51:36

ఉయ్యాలే ఉరితాడై బాలిక మృతి

ఉయ్యాలే ఉరితాడై బాలిక మృతి

కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఉల్లాసంగా ఆడుకునే  ఉయ్యాలే ఆ బాలిక పాలిట యమపాశమైంది. పదేళ్ల నిండకుండానే నూరేళ్ల ఆయుష్షు తీసింది. ఉయ్యాల ఊగుతుండగా తాగు మెడకు చుట్టుకొని బాలిక మృతి చెందింది. కాగజ్‌నగర్‌ మండలం నజ్రుల్‌నగర్‌ గ్రామం నెంబర్‌ 9లో బుధవారం ఈ హృదయ విదారక ఘటన జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాలివి..  నజ్రుల్‌నగర్‌ గ్రామం నెంబర్‌ 9కు చెందిన సమర్‌ సర్కార్‌, బబితా సర్కార్‌ దంపతులకు నలుగురు కూతుళ్లు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

బుధవారం ఉదయం పెద్దకుమార్తెను తీసుకొని తల్లిదండ్రులు పొలం వెళ్లారు. రెండోకుమార్తె  రియాసర్కార్‌ (10) ఇంటి వద్ద ఉండి ఇద్దరు చెల్లెలను ఆడిస్తోంది. మధ్యాహ్నం బాలిక ఊయల ఊగుతుండగా తిరగబడి తాడు మెడకు చుట్టుకుపోయి బిగిసుకొని మృతిచెందింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురు మృతిచెందిన విషయం తెలుసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.