మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 15:01:55

హైదరాబాద్‌ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు

హైదరాబాద్‌ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు

హైదరాబాద్‌ : తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్‌ నగరాభివృద్ధికి రూ. 10 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. భారతదేశంలోని ఆరు మెట్రో నగరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అనేక సార్లు కేంద్రాన్ని కోరారు. అయినప్పటికీ హైదరాబాద్‌ సహా ఇతర నగరాలకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించలేదని తెలిపారు. అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చే ఐదేళ్లలో రూ. 50 వేల కోట్లు అవసరమని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసిందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌ నగరం, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధితో పాటు, మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అమలు కోసం ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ. 10 వేల కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మెట్రో రైలుకు సంబంధించి పాత బస్తీలో మిగిలిన ఐదు కిలోమీటర్ల మార్గం త్వరలోనే పూర్తవుతుందన్నారు. రెండో దశలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌, బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు మెట్రో రైలు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని మంత్రి తెలిపారు.


logo
>>>>>>