మంగళవారం 26 మే 2020
Telangana - May 15, 2020 , 01:43:32

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

  • 10మంది దుర్మరణం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగులుప్పలపాడు మండలంలో గురువారం సాయంత్రం మిరప కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. తీగలుతెగి ట్రాక్టర్‌పై పడటంతో విద్యుద్ఘాతానికి గురై పదిమంది కూలీలు దుర్మరణం చెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు, ఒక రైతు కూడా ఉన్నారు. ప్రమాదానికి అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తున్నది. ట్రాక్టర్‌లో కూలీలు మిరప కోత పనులకు వెళ్లారు.  logo