గురువారం 04 జూన్ 2020
Telangana - May 08, 2020 , 18:30:05

తెలంగాణలో కొత్తగా 10 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 10 పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 376 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని చెప్పారు.   రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,132కు చేరిందన్నారు. కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదని చెప్పారు. మంత్రి ఈటెల మీడియాతో మాట్లాడారు. 

'కరోనా నుంచి ఇవాళ 34 మంది డిశ్చార్జ్‌ కాగా ఇప్పటి వరకు 727 మంది కోలుకున్నారు. కేంద్రం నిబంధనల ప్రకారం మరో 14 జిల్లాల్లో కరోనా లేదు.  హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌  జిల్లాల నుంచే కొత్తగా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. కేంద్రం మార్గదర్శకాలతో అనేక జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వెళ్లాయి. లాక్‌డౌన్‌.. కేంద్రం ఈనెల 17 వరకు అని చెప్పినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 29 వరకు పొడిగించారు. కరోనా రాకుండా ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 9 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. మరో 14 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరాం. సోమవారం కేంద్రం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని' మంత్రి పేర్కొన్నారు. 


logo