సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 11:55:58

ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయిద్దాం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయిద్దాం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్ : ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల సమయం కేటాయించి ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకొని ఆరోగ్యకరమైన జీవితం గడుపుదామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ‘మీకోసం’ కార్యక్రమంలో భాగంగా తన ఇంటి ఆవరణలోని మొక్కల మధ్య ఉన్న కలుపు తీసి నీటి గుంతలు తొవ్వి మొక్కలకు నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు సోకకుండా దోమల నివారణకు ప్రతి ఒక్కరూ ఇళ్లలో, ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలన్నారు.

ఇలా చేయడం వల్ల పొడి వాతావరణం ఏర్పడి దోమల లార్వా, క్రిమికీటకాల ఉత్పత్తి నివారణకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్ రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ నిర్మల్ పట్టణాధ్యక్షులు మారుగొండ రాము, తదితరులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo