శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 16, 2021 , 07:54:20

హైకోర్టులో 10 జడ్జి పోస్టులు ఖాళీ

హైకోర్టులో 10 జడ్జి పోస్టులు ఖాళీ

హైదరాబాద్ :  రాష్ట్ర  హైకోర్టులో 10 న్యాయమూర్తి పదవులు ఖాళీగా ఉన్నాయి. 18 మంది శాశ్వత న్యాయమూర్తులు, ఆరుగురు అదనపు జడ్జిలు కలిపి మొత్తం 24 మంది ఉండాలి. ప్రస్తుతం 14 మందే ఉన్నారు. హైదరాబాద్‌ బర్కత్‌పురకు చెందిన కరీం అన్సారీ ‘యూఆర్టీఐ’ సంస్థ ద్వారా చేసిన దరఖాస్తుకు కేంద్ర న్యాయశాఖ సమాధానం ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 25 హైకోర్టుల్లో మొత్తం 411 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర న్యాయశాఖ తెలిపింది. జనవరి 1 2021 నాటికి 25 హైకోర్టుల్లో 668 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారని, మొత్తం 411 పదవులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. సుప్రీంకోర్టులో 30 మంది న్యాయమూర్తులు పనిచేస్తుండగా.. నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వెల్లడించింది.  

VIDEOS

logo