నాగర్కర్నూల్ : శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5,00,203 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 5,27,323 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 211.5133 టీఎంసీలు. ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తడంతో.. ఆ దృశ్యాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా పోటెత్తారు.