నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు 10 క్రస్ట్ గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తివేత నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి 2,16,137 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1,33,137 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.
సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 589.70 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.1486 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.