నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు పది క్రస్ట్ గేట్లు ఎత్తివేశారు. సాగర్లోకి ప్రస్తుతం 1,37,239 క్యూసెక్కుల నీరు వస్తుంది. దీంతో 1,26,864 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
క్రస్టు గేట్ల ద్వారా 80,900 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8718 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 9274 క్యూసెక్కుల నీరు కిందికి వెళ్తున్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 589.90 అడుగుల వద్ద నీరు ఉన్నది. జలాశయం గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకుగాను 311.7462 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.