శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 27, 2020 , 09:32:31

తెలంగాణలో కొత్తగా 1,967 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,967 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 1,967 పాజిటివ్‌ కరోనా కేసులు నమోదుకాగా కోవిడ్‌ బారినపడిన వారిలో 2,058 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 9 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,85,833 మంది కరోనా బారినపడగా 1,54,499 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా 30,234 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 24,607 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా 1,100 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవిడ్‌ మరణాల రేటు 0.59 శాతంగా ఉండగా రికవరీ రేటు 82.939 శాతంగా ఉందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 50,108 మందికి కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 28,50,869 టెస్టులు పూర్తిచేసినట్లు వివరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo