గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 22:07:17

తెలంగాణలో కొత్తగా 1924 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1924 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణలో బుధవారం 1,924 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ  తెలిపింది. ఇందులో కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 1,590 నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి వారిలో ఇవాళ  11 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 29,536 కేసులు నిర్ధారణ కాగా, 11,933 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 17,279 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు వైరస్‌ ప్రభావంతో 324 మంది మృతి చెందారు. 

బుధవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,590, రంగారెడ్డి జిల్లాలో 99, మేడ్చల్‌లో 43, సంగారెడ్డిలో 20, కరీంనగర్‌లో 14, మహబూబ్‌నగర్‌ 15, కామారెడ్డిలో 3, నల్గొండ 13, వరంగల్‌ రూరల్‌ 26, వరంగల్‌ అర్బన్‌ 7, నిజామాబాద్‌ 19, వికారాబాద్‌ 11, మెదక్‌ 5, పెద్దపల్లి 5, సూర్యపేట 7, ఖమ్మం 4, జగిత్యాల 3, భద్రాద్రి కొత్తగూడెం 3, రాజన్న సిరిసిల్ల 13, ఆదిలాబాద్‌ 3, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ఒకటి, నాగర్‌కర్నూల్‌ 3, వనపర్తి 9, యాదగిరి 5, నారాయణపేట జిల్లాలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo