ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 10:24:43

రాష్ట్రంలో కొత్త‌గా 1921 క‌రోనా కేసులు

రాష్ట్రంలో కొత్త‌గా 1921 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: ‌రాష్ట్రంలో క‌రోనా బారిన‌ప‌డిన‌వారిలో నిన్న మ‌రో 1210 మంది కోలుకున్నారు. దీంతో క‌రోనా నుంచి కోలుకున్న‌వారి శాతం 72.72కు చేరింది. ఈరోజు ఉద‌యం వ‌ర‌కు కొత్త‌గా 1921 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల‌ సంఖ్య 88,396కు చేరింది. ఇందులో 23,438 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 64,284 మంది కోలుకున్నారు. హోం ఐసోలేష‌న్‌లో 16,439 మంది ఉన్నార‌ని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది..

గురువారం ఉద‌యం నుంచి నేటి ఉద‌యం వ‌ర‌కు క‌రోనాతో కొత్త‌గా 9 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం క‌రోనా మృతులు 674కు పెరిగారు. రాష్ట్రంలో కోల‌కున్నావారి శాతం 72.72 ఉండ‌గా, మ‌ర‌ణించిన‌వారి శాతం 0.76గా ఉన్న‌దని తెలిపింది. 


logo