బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 02:41:09

పోటెత్తిన కృష్ణమ్మ

పోటెత్తిన కృష్ణమ్మ

  • జూరాలకు 1,77,554  క్యూసెక్కులు
  • శ్రీశైలానికి ఐదు లక్షల క్యూసెక్కుల వరద
  • నాగార్జున సాగర్‌కు 5.76 లక్షల క్యూసెక్కులు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: మహోగ్రరూపాన్ని తలపించిన కృష్ణమ్మ సోమవా రం కాస్త శాంతించింది. ఎగువ నుంచి వర ద భారీగా వస్తుండటంతో కర్ణాటక, తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు నీటితో తొణికిసలాడుతున్నాయి. జూరాలకు భారీగా వర ద వస్తుండటంతో 26 గేట్లను ఎత్తి దిగువకు 1,77,554 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 2,35,800 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 1,99,341 క్యూసెక్కులుగా నమోదైం ది. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 60,160 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 43,088 క్యూసెక్కులు, నారాయణపురకు ఇన్‌ఫ్లో 69,188 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 60,777 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. జూరాల, సుంకేశుల నుంచి 2,64,339 క్యూసెక్కులు దిగువకు విడుదల చేయగా.. జలాశయానికి 5,01,360 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో అధికారులు డ్యాం 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 4,69,190 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. దీంతో కుడి గట్టు విద్యుదుత్పత్తి కేంద్రానికి 30,482 క్యూసెక్కులు విడుదల చేస్తుండ గా.. మొత్తం 4,99,672 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. నాగార్జునసాగర్‌కు 5,76,478 క్యూసెక్కులు వస్తుండగా, 6,04,145 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీకి 1,69,885 క్యూసెక్కుల వరద వస్తుండగా 1.75 లక్షల క్యూసెక్కులను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

సింగూరుకు జలకళ

సింగూరు ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. మూడేండ్ల తర్వాత ప్రాజెక్టులోకి తిరిగి నీళ్లొచ్చాయి. ఈ నీటితో ఐదు మండలాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు, తొ మ్మిది నియోజకవర్గాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటికి ఢోకా ఉండదు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, సోమవారం సాయంత్రం వరకు 23.604 టీఎంసీల నీరు చేరింది. 9వేల క్యూసెక్కుల వరద వస్తున్నది.


logo