గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 21:11:51

తెలంగాణలో 1,567 పాజిటివ్‌ కేసులు నమోదు

తెలంగాణలో 1,567 పాజిటివ్‌ కేసులు నమోదు

హైదరాబాద్‌ : తెలంగాణలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 50 వేలకు చేరువయ్యాయి. తాజాగా గురువారం రాష్ట్రంలో 1,567 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 662 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50,826 కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ తొమ్మిది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 447కి చేరింది. 

ఇవాళ 1,661 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 39,327 (77.3%) మంది డిశ్చార్జి అయ్యారు. మరో 11,052 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం 13,367 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 3,22,326 మందికి టెస్టులు చేసినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొన్నది.

గురువారం రంగారెడ్డి జిల్లాలో 213, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 75, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 62, మహబూబ్‌నగర్‌లో 61, నాగర్‌కర్నూల్‌ లో 51, నల్లగొండలో 44, నిజామాబాద్‌, సూర్యాపేటలో 39, కరీంనగర్‌లో 38 కేసులు చొప్పున నమోదయ్యాయి. అలాగే, మేడ్చల్‌లో 33, సంగారెడ్డిలో 32, మెదక్‌లో 27, జయశంకర్‌ భూపాలపల్లిలో 25, వరంగల్ రూరల్‌, జనగామ జిల్లాల్లో 22 చొప్పున, మహబూబాబాద్‌ జిల్లాలో 18, కామారెడ్డి, ములుగు, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 17 చొప్పున, జగిత్యాలలో 14, ఖమ్మంలో 10, సిద్దిపేటలో 9,వికారాబాద్‌లో 5,యాదాద్రి భువనగిరి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో 4 కేసులు చొప్పున, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల జిల్లాల్లో రెండు చొప్పున నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. 


logo