సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 09:14:19

తెలంగాణలో కొత్తగా 1,378 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,378 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,378 పాజిటివ్‌ కేసులు నమోదుయ్యాయి.  వైరస్‌ బారినపడిన వారిలో 1,932 మంది కోలుకొని డిశ్చార్జి కాగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,87,211 మంది కోవిడ్‌-19 వైరస్‌ బారినపడగా 1,56,431 మంది చికిత్సకు కోలుకున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 1107 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది.

ప్రస్తుతం 29,673 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా హోం ఐసోలేషన్‌లో 24,054 మంది ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 35,465 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 28,86,334 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.  రాష్ట్రంలో కరోనా మరణాల శాతం 0.59గా ఉందని, రికవరీ రేటు 83.55 శాతంగా ఉందని వివరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



logo