సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 01:55:02

6 అంబులెన్స్‌లకు 1.23 కోట్లు

6 అంబులెన్స్‌లకు 1.23 కోట్లు

  • మంత్రి కేటీఆర్‌కు చెక్కు అందజేసిన ఎంపీ నామా 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా ఆరు అంబులెన్స్‌ల కొనుగోలు కోసం టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు రూ.1.23 కో ట్లు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మంత్రి కే తారకరామారావుకు అందజేశారు. ఆయన వెంట ఎంపీలు వెం కటేశ్‌, మాలోతుమాలోతు కవిత ఉన్నారు. 

విద్యార్థులకు గురువులే స్ఫూర్తి

విద్యార్థులు తమ సామర్థ్యాన్ని సాకారంచేసుకునే దిశగాచేసే ప్రయాణంలో ఉపాధ్యాయులు వారధి వంటివారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆ ప్రయత్నంలో అడుగడుగునా వారిలో స్ఫూర్తిని నింపుతున్న ఉపాధ్యాయులకు శనివారం ట్విట్టర్‌ ద్వారా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


తాజావార్తలు


logo