శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 12, 2020 , 00:52:44

కేసీఆర్‌కు పుట్టినరోజు కానుకగా 1,01,116 మొక్కలు

కేసీఆర్‌కు పుట్టినరోజు కానుకగా 1,01,116 మొక్కలు
  • అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్యక్రమం: మంత్రి సబితాఇంద్రారెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జన్మదినం కానుకగా ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో 1,01,116 మొక్కలు నాటనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలు, ఇంటర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లుచేశామని, స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. మొక్కలు నాటడమే కాకుండా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టి సీఎం కేసీఆర్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకొంటామని మంత్రి పేర్కొన్నారు.


logo