ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 16:13:21

పరిశుభ్రతను పాటిద్దాం..వ్యాధులను తరిమికొడుదాం

పరిశుభ్రతను పాటిద్దాం..వ్యాధులను తరిమికొడుదాం

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. ప్రతి ఆదివారం ఉదయము పది గంటల పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా.. మంత్రి మల్లారెడ్డి  తన స్వగృహంలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. అంటు వ్యాధులు ప్రబలకుండా నివారించడానికి ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డెంగీ, చికున్ గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు ప్రతి ఆదివారం పది నిమిషాలకు పాటు విధిగా ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలన్నారు. ఇంటికి సంబంధించిన ఓవర్ హెడ్ ట్యాంకులు శుభ్రం చేస్తే దోమలు దరి చేరవన్నారు. ప్రతి పౌరుడు ఈరోజు నుంచే ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. 


logo