ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 10:53:53

ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి : మంత్రి ఎర్రబెల్లి

ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్ : కేసీఆర్ పోరాట పటిమ, అమరుల బలిదానాలు వెరసి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ లోని అమరుల స్థూపం వద్ద తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాని మంత్రి ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్నరాష్ట్రాన్నిసీఎం కేసీఆర్ దేశంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు.

ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా జనరంజక పాలన సాగుతున్నదని తెలిపారు. ప్రాజెక్ట్ ల నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతున్నదని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కరోనా కష్ట కాలంలోనూ నిరాటంకంగా కొనసాగుతున్నాయని, రైతుని రాజును చేసే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నారని చెప్పారు. జిల్లా అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని, వరంగల్ రూరల్ జిల్లాలో అనేక పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. అన్ని రంగాల్లో వరంగల్ ను అగ్రగామిగా మారుస్తామని వెల్లడించారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు.


logo