లండన్, మే 19: ఐరోపా, ఉత్తర అమెరికాలో పదుల సంఖ్యలో మంకీపాక్స్ కేసులు నమోదు అవుతున్నాయి. దీనిపై డబ్ల్యూహెచ్‌వో దృష్టి పెట్టింది. మంకీపాక్స్ అరుదైన వైరల్ ఇన్ఫెక్షన్. ఇది మనుషుల్లో స్మాల్‌పాక్స్ లాంటిదే. ఈ వైరస్ సోకిన జంతువులు కరిచినప్పుడు మనుషులకు సోకుతుంది. ఈ వైరస్ సోకిన జంతువుల మాంసం తింటే కూడా మనుషులకు ఈ వ్యాధి రావొచ్చు. మంకీపాక్స్‌ను మొట్టమొదటిసారి 1958లో గుర్తించారు. మనుషుల్లో ఈ వ్యాధిని 1970లో గుర్తించారు.